షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. కడపకు చెందిన మాజీమంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్‌లో చేరారు. అహ్మదుల్లాకు కండువా వేసి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు.
అహ్మదుల్లా 2004, 2009లో కడప ఎమ్మెల్యేగా గెలుపొంది దివంగత సీఎం వైఎస్ఆర్ మంత్రివర్గంలో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం పార్టీకి దూరమైన అహ్మదుల్లా.. షర్మిల పగ్గాలు చేపట్టాక మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.