కొబ్బరిని ఆశించే నల్లముట్టు పురుగు నివారణ పై శనివారం ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ చిక్కం జంగమయ్య పెదబాబు అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సు లో అంబాజీపేట కీటక శాస్త్రవేత్త డాక్టర్ వి. అనూష, ఉద్యాన శాఖ అధికారి చందన కొబ్బరి సాగులో నల్లముట్టు పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులను రైతులకు వివరించారు. కొబ్బరి సాగులో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.