స్వాతంత్య్రానికి ముందు సత్యం.. న్యాయప్రక్రియలో సమగ్ర భాగంగా ఉండేదని, స్వాతంత్య్రం తర్వాత భౌతిక వాదం పురాతన విలువలను కమ్మేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
అబద్దాలు తీయగా కమ్మగా ఉంటాయని, సత్యాలు ఎల్లప్పుడూ చేదుగా గోచరిస్తాయని వ్యాఖ్యానించింది. 40ఏళ్లలో విలువలు పడిపోయానని, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడానికి ఎంతకైనా తెగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ కేసులో బెయిలు ప్రొసీడింగ్స్‌ను క్రమబద్ధీకరించే విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.