చిత్తూరు జిల్లా, దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ ఆలయంలో టీడీపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడపగడపకు రా.. కదలిరా.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని మొత్తం 50 డివిజన్లలో ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగనుంది. టీడీపీ నుంచి టికెట్టు ఆశిస్తున్న ఆరుగురు ఆశావహలు కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో ఆరుగురు ఆశావహులు చంద్ర ప్రకాష్, గురజాల జగన్మోహన్, కటారి హేమలత, కాజురు బాలాజీ, డీకే కుటుంబం, సీఆర్ రాజన్‌లు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఎంగా గెలిపించుకోవడమే లక్ష్యంగా కార్యక్రమం చేట్టారు.