ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, త్రిపుర, మేఘాలయా ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్బంగా ప్రధాని మోదీ అక్కడి ప్రజలకు X వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘మణిపూర్ నిరంతర అభివృద్ధి చెందాలని, రాబోయే రోజుల్లో మేఘాలయా సరికొత్త అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని, ఈ ప్రత్యేకమైన రోజున త్రిపుర ప్రజల శ్రేయస్సు, సామరాస్యాన్ని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.