త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఆయన రాష్ట్రాన్ని విభజించారు.
ఈ నెలాఖరులోగా సీట్ల పంపకాలపై టీడీపీ నుంచి క్లారిటీ తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. అభ్యర్ధులు ఎవరనేది తేలితే.. తాను నిశ్చింతగా ప్రచారం నిర్వహించుకోవచ్చుననేది పవన్ ఆలోచన. చంద్రబాబు కూడా సీట్ల పంపకాలపై నాన్చకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.