త్వరలోనే ప్రధాని మోదీ బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘విశ్వనేత’ పేరుతో అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రాన్ని వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్నారు. చాయ్ వాలా స్థాయి నుంచి ‘విశ్వనేత’గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa