దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు ఎముకలు కొరికే చలిలో వణుకుతున్నారు. దీనికి తోడు దట్టమైన పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. జీరో మీటర్ విజిబిలిటీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ పొగమంచు కారణంగా ఇవాళ భారీ సంఖ్యలో రైళ్లు, విమానాలు ఆలస్యం, రద్దయ్యాయని వెల్లడించారు. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రత 7 సెల్సియస్‌కు పడిపోయిందని, అత్యధిక ఉష్ణోగ్రత 18 సెల్సియస్‌గా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనావేసింది.