ప్రతి ఏడాది రిపబ్లిక్ డే రోజు ఢిల్లీ పరేడ్ లో అద్భుతమైన సైనిక కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనల్లో దేశంలోని పలు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక సంస్కృతి పరేడ్ లో ప్రతిబింబిచేలా ప్రదర్శన ఉంటుంది.
ఈ వేడుకలు చూసేందుకు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలితో సహా అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో శకటాల ప్రదర్శన రోజుకే ఎంతో హైలెట్ గా నిలుస్తుంది. కవాతు రాష్ట్రపతి భవన్ సమీపంలోని రైసినా హిల్లో ప్రారంభమవుతుంది. ఇండియా గేట్ నుంచి ఎర్రకోట వరకు సుమారు 5 కి.మీ.మేర నిర్వహిస్తారు.