గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన వాహనంలోంచి దిగడం భద్రతా నియమాలకు విరుద్ధమని, ఆయన అలా చేసి ఉండకూడదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం అన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా గవర్నర్ ఖాన్ పదే పదే వ్యవహరిస్తున్నారని విజయన్ అన్నారు. ఏ అధికార హోదా కూడా చట్టానికి అతీతం కాదని విజయన్ సూచించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ల నియామకాన్ని గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళనకారులు కొల్లాంలో గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గవర్నర్ కారు దిగి ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసుల తీరును గవర్నర్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గవర్నర్‌కు భద్రతను పెంచారు. రాజ్‌భవన్‌కు, గవర్నర్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa