విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు వలంటీర్లకు ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటు చేసారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అయిన ఆయన్ను సెంట్రల్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సెంట్రల్ సిటింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరగణం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఆదివారం 61, 62, 63, 64 డివిజన్ల వలంటీర్లతో నగరంలో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లింది వలంటీర్లేనని అన్నారు. తన గెలుపు కోసం ప్రతి వలంటీర్ సహకరించాలని కోరారు. వలంటీర్లందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికీ కుక్కర్‌ను బహుమతిగా ఇచ్చి పంపారు.