గల్ఫ్ దేశంలో నిర్బంధించబడిన ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందిని విడుదల చేసిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖతార్‌లో పర్యటించనున్నారు. యుఎఇ పర్యటన ముగించుకుని ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ ఖతార్‌కు చేరుకుంటారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా సోమవారం (ఫిబ్రవరి 12) ప్రత్యేక సమావేశంలో తెలిపారు. ఇరు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకునే చర్యలపై మరింత చర్చిస్తాయని క్వాత్రా తెలిపారు.ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ దేశంలో నిర్బంధించబడిన ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందిని ఖతార్ విడుదల చేసిన తర్వాత ఈ పర్యటన ప్రకటన వచ్చింది.