రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలను వైయస్ఆర్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకోనుంది. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేశారు. ఈ మూడు స్థానాలతో వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరనుంది. ఏప్రిల్ 2తో పూర్తికానున్న టీడీపీ సభ్యుడు ‘కనకమేడల’, వైయస్ఆర్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ల పదవీకాలం ముగియనుంది. ఈలోగా అంటే రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు జరగాలి. కానీ పోటీగా ఎవరూ నామినేషన్లు వేయలేదు కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైయస్ఆర్‌సీపీ పరం కానున్నాయి.