వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా..? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని అన్నారు. వలంటీర్ వ్యవస్థపై పవన్ చెప్పిన విషయాలపై కేసు నమోదు చేస్తారా..? అని ప్రశ్నించారు. వారిని ఇంటింటికీ తిరిగి సమాచారం తేవాలని ఎవరు చెప్పారు..? అని నిలదీశారు. వలంటీర్లు సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు. సమాధానం చెప్పకుండా పోలీసులు, మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా..? అని నిలదీశారు. వారిలో 21 వేలమంది పీజీ చేసినవారు ఉన్నారని తెలిపారు. వలంటీర్ల కోసం ఏటా రూ.1760 కోట్లు ఖర్చు చేశారని.. వాటిలో రూ.617 కోట్లు డేటా సేకరణ కోసం కేటాయించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.