విజయనగరం జిల్లా, రామతీర్ధంలో అగర్‌బత్తీలయూనిట్‌ను నాబార్డ్ డీజీఎం సోమవారం పరిశీలించారు. నాబార్డు సౌజన్యంతో గతఏడాది జనవరిలో రామతీర్ధం దేవా లయంలో వాడిన పువ్వులతో అగరబత్తీలు, ధూప్‌స్టిక్స్ తయారీలో 30 మందికి శిక్షణఇచ్చారు. శిక్షణ అనంతరం రామతీర్ధం ఏపీజీవీబీ, పీఎంఈజీపీ ద్వారా అగర్ బత్తీల తయారీ యూనిట్‌ను నడిపిస్తున్నారు. ఈ యూనిట్‌ను నాబార్డు డీజీఎం ఎస్.ఫణిశేఖర్, డీడీఎం నాగార్జున పరిశీలించారు.కార్యక్రమంలో డీఆర్‌డీఓ ఏపీడీ కె.సావిత్రి, గరివిడి ఏరియా కోఆర్డినేటర్ బి.బంగారమ్మ, ఏపీఎంలు, సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు. అనంతరం రామతీర్థం రామస్వామిని దర్శించుకున్నారు.