ఇటీవల కాలంలో డీప్‌ఫేక్‌ల బెడద ఎక్కువవుతుండటంతో ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ ఆధారంగా రూపొందిస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్‌లో 'ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్'ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు మిస్‌ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్(ఎంసీఏ), మెటా సంయుక్తంగా పనిచేయనున్నట్లు తెలిపింది. మార్చి కల్లా దీన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మోటా వెల్లడించింది.