మరాఠా కోటా బిల్లుపై మహారాష్ట్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం మరాఠా రిజర్వేషన్ల బిల్లు డ్రాఫ్ట్‌కు సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ప్రత్యేక విధానసభ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో 'మరాఠా రిజర్వేషన్' కీలక ఎజెండా. మరాఠా కోటా కోసం రాష్ట్రం చట్టం తీసుకురావడం దశాబ్ద కాలంలో ఇది మూడోసారి.