పేదల పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేలా వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి అందిస్తున్న ఈ సాయాన్ని నేడు మరోసారి అమలు చేయనున్నారు. గత ఏడాది (2023) అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయస్ జగన్ నేడు తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లలకు వైయస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడ పిల్లలకు వైయస్ఆర్ షాదీ తోఫా ద్వారా సీఎం వైయస్ జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు.