కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో ఎన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. ఈ కేసులో బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 19కి ఏన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టు వాయిదా వేసింది. వాయిదా అనంతరం లాయర్ సలీమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో జగన్ తన వాంగ్మూలం ఇవ్వాలన్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరగాలంటూ సీఎం జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై పోరాడాతామని తెలిపారు. ఎన్నికలకు ముందే ఈ కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తామన్నారు. సీఎం వాంగ్మూలం ఇస్తే ఈ కేసు 90% క్లోజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో నీళ్లు ఏవో పాలు ఏవో తేలుస్తామని లాయర్ సలీమ్ పేర్కొన్నారు.