చంద్రబాబును కలిసి పదవి పోగొట్టుకున్నారో వైఎస్సార్‌సీపీ నేత. ఆ పదవి ఇటీవల వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన నేతకు దక్కింది. చంద్రబాబును కలిసిన కారణంగా సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్(శాప్‌నెట్) ఛైర్మన్ బాచిన కృష్ణచైతన్యకు ఆ పదవిలో కొనసాగే అవకాశం లేకుండా పోయింది. ఆయనను ఛైర్మన్‌గా కొనసాగించేలా సిద్ధం చేసిన ఆర్డర్లను ప్రభుత్వం ఆపేసింది. ఆయనకు బదులుగా కర్నూలు జిల్లాకు చెందిన మాచాని వెంకటేశ్‌ను శాప్‌నెట్ ఛైర్మన్‌గా నియమిస్తూ మూడు రోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చింది.
బాపట్ల జిల్లా అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న కృష్ణచైతన్యను ఆ పదవి నుంచి పార్టీ తప్పించింది. దీనికి ప్రతిఫలంగా మరోసారి శాప్‌నెట్ ఛైర్మన్‌గా ఆయననే కొనసాగించాలని నిర్ణయించింది. తాజా పరిణామాలతో పరిస్థితి మారిపోయింది. బాచిన కృష్ణచైతన్య తన తండ్రి గరటయ్యతో కలిసి గతవారం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. తండ్రీకొడుకులు తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది.
గతంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా వెంకటేశ్‌ను ప్రకటించింది. కొద్ది రోజులకే ఆయన్ను తప్పించి.. మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరును తెరపైకి తీసుకొచ్చింది. దీంతో వెంకటేశ్ నిరుత్సాహంలో ఉన్నారు. ఈలోపు సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ ఛైర్మన్ పదవి నుంచి చైతన్యనను ఆ పదవి నుంచి పక్కన పెట్టారు. దీంతో శాప్‌నెట్ ఛైర్మన్ పదవిని ప్రభుత్వం వెంకటేశ్‌కు కట్టబెట్టింది. సాధారణ ఎన్నికల ముంగిట ఆయనకు ఈ పదవి కట్టబెట్టడం విశేషం.