ఏపీ టెట్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. కృష్ణా జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 3615 మంది అభ్యర్థులకు 3299 మంది హాజరయ్యారు. 91.25 శాతం హాజరు నమోదైంది. ఉదయం 1637 మంది, మధ్యాహ్నం 1662 మంది హాజరయ్యారు. విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, డైట్ ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణలు కానూరు అయాన్ డిజిటల్ జోన్, కానూరు శైలేష్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ కేంద్రాలను సందర్శించారు. మచిలీపట్నం ఎస్వీహెచ్ డీఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలను ఏడీ మనోహర్ నాయక్, ఎంఈవో దుర్గా ప్రసాద్‌లు సందర్శించారు.