శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం ఆరు మండలాలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించారు. పలు గ్రామాలలో తనిఖీలు చేపట్టి అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని, ఎన్నికల నేపథ్యంలో గొడవలకు దూరంగా ఉండాలని. సమస్యలు సృష్టించినా, కారణమైనా చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు.