అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారత్ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ భారీ ఆపరేషన్ చేపట్టాయి. గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని సీజ్ చేశారు.
సుమారు 3089 కేజీల ఛారస్, 158 కేజీల మెటా ఫెటమైన్, 25 కేజీల మార్ఫైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఓ చిన్న షిప్‌ను నేవీ పట్టుకుంది. ఐదుగురు పాకిస్థానీలను నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.