తాడేపల్లిగూడెంలో బుధవారం జరగనున్న రా..కదలిరా సభకు పెనమలూరు నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో స్థానిక టీడీపీ శ్రేణులతో ఆయన మాట్లాడుతూ నేడు జరిగే తొట్టతొలి టీడీపీ- జనసేన ఉమ్మడి సభను విజయవంతం చేయాలని కోరారు. సైకో జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఐదేళ్లుగా పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రం వెనుక పడడంతో నిరుద్యోగులు, కార్మికులు అన్ని రకాల వర్గాలు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చిస్తూ జరగబోయే సభను టీడీపీ- జనసేన నేతలు, కార్యకర్తలు సభను విజయవంతం చేసి రాష్ట్ర ప్రజలకు సరైన సంకేతం పంపాలని కోరారు. నాయకులు అనుమోలు ప్రభాకరరావు, కోయ ఆనంద్ ప్రసాద్, పీతా గోపీచంద్, యువనేతలు బోడె వెంకట్రాం, బోడె మనోజ్, సురేంద్ర, శేఖర్ పాల్గొన్నారు.