తాడేపల్లిగూడెం సభలో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై కీలక వ్యాఖలు చేసారు. జగన్... ఒక సామాన్యుడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం అని అన్నారు. సీఎం జగన్ నీ కోటలు బద్దలు కొడతాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఒప్పుకున్నందుకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. వామనుడిలా నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ పేరు జనసేన కాదు... అంటూ సవాల్ విసిరారు. ఎన్నికల తర్వాత వైసీపీ వాళ్లకు మనమేంటో అర్థమవుతుంది... నెత్తిమీద కాలేసి తొక్కుతాం కదా.. అప్పుడు మనమేంటో వాళ్లకు అర్థమవుతుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూశారు... ఇప్పుడు నా యుద్ధం చూస్తారు అని అన్నారు.