విశాఖవాసుల్ని పోలీసులు అలర్ట్ చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లెంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ మొదలగు తీవ్ర నేరాలను అరికట్టే ముఖ్య ఉద్దేశం తో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని భారత నుపీం కోర్పు విచారించి ఒక మహత్తర తీర్పును 2012 ఏప్రిల్ 27న వెలువరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ తీర్చు అవిషేక్ గోయంకా vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించినది అన్నారు. ఈ తీర్పు ద్వారా భారత మోటార్ వాహనాల రూల్స్ 1989కు తగు వివరణ ఇచ్చారన్నారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మోటార్ వాహనాల యజమానులు.. తమ కార్లతో పాటుగా మిగిలిన వాహనాలకు ముందు, వెనుక, ప్రక్నక అద్దాలకు ఎటువంటి ఫిల్మ్‌లు అతికించడం, ఇతర పేపర్లు అతికించకూడదు అన్నారు. సదరు వాహన అద్దాల తయారీ సమయంలోనే దృశ్య కాంతి ప్రసారం (విజుబిలిటీ) ముందు, వెనుక అద్దాలకు 70%, ప్రక్క అద్దాలకు 50% ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలా తయారు చేయబడిన వాహానాల అద్దాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. అంతేకాని ఎలాంటి ఫిల్మ్‌లు, ఇతర పేపర్లు అద్దాలపై అంటించకూడదన్నారు.
పైన తెలిపిన నిబంధనలు నగరంలో తిరిగే ప్రతీ మోటార్ వాహనం ( కార్లు, ఇతర వాహనాల) యజమానులు తప్పనిసరిగా గమనించి, వారం రోజులలో తమ వాహనాల యుక్క అద్దాలపై ఉన్న ఫిల్మ్‌లను స్వచ్చందంగా తొలగించాలని సూచించారు. వాహన యజమానులు అందరూ గమనించాలన్నారు. వారం రోజుల తర్వాత నగర ట్రాఫిక్ పోలీసులు సదరు నిబంధనలు పాటించని వాహనాదారులపై మోటార్ వాహనాల చట్టం, నిబంధనల మేరకు జరిమానా విధించి, అక్కడికక్కడే వారి వాహనాల ఫిల్మ్ లను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ ఐపీఎస్ రవిశంకర్ నగర ప్రజలకు, వాహనదారులకు, వాహన యజమానులకు తెలియజేశారు.
మరోవైపు విశాఖ నగర పోలీస్ కమీషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డా ఏ రవి శంకర్, ఐపీఎస్ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల పురోగతి, నగరంలో రోడ్డు ప్రమాదాలు నివారణ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాలు ప్రతీ స్టేషన్ పరిధిలో ఏర్పాటు, మహిళా భద్రతకు ప్రాధాన్యత మొదలైన అంశాలు పై చర్చించి, సైబర్ క్రైమ్ కేసులలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, క్రైమ్ రేటు తగ్గేలా నిఘా పటిష్టం చేయాలనీ, గంజాయి రవాణానీ పూర్తిగా అడ్డుకట్ట వేయటానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించాలని, రౌడీ షీటర్ల పై ఉన్న కేసులు క్షుణ్ణంగా పరిశీలించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాలు ఎక్కడ జరగకుండా నిరోధించాలని అధికారులకు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు పనితీరు ప్రత్యేకంగా సమీక్షిస్తూ అక్రమ మద్యం, నగదు, ఇతర అనుమానిత వస్తువులను పూర్తిగా నివారించేలా అన్ని వాహనాలను నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.