పాకిస్థా్న్, చైనాల బంధం గురించి మనకు తెలిసిందే. భారత్‌ను దెబ్బకొట్టేందుకు పాకిస్థాన్‌కు ఎలాంటి సహాయం అయినా చైనా చేస్తుంది. ఇక తమ అవసరాల కోసం చైనా ఏం చెప్పినా చేస్తుంది పాక్. ఇదీ ఈ రెండు దేశాలకు భారత్‌పై ఉన్న ఉమ్మడి అక్కసు. ఈ క్రమంలోనే భారత్‌కు వ్యతిరేకంగా ప్రతీ విషయంలో ఈ రెండు దేశాలు కలిసి ఉంటాయి. అయితే తాజాగా చైనా నుంచి పాకిస్థాన్‌కు వెళ్తున్న పాక్ నౌకలో మిలిటరీ గ్రేడ్ వస్తువులు ఉన్నాయని.. నిఘా వర్గాలు భారత నౌకా దళాన్ని అలర్ట్ చేశాయి. దీంతో అప్రమత్తమైన ఇండియన్ నేవీ.. ఆ నౌకను ముంబై పోర్టులో అడ్డుకున్నారు. ఆ నౌకలో అణు కార్యక్రమంలో ఉపయోగించే సరుకు ఉందనే అనుమానంతో నిలిపివేశారు.
CMA CGM Attila పేరుతో ఉన్న పాక్ నౌకను జనవరి 23 వ తేదీనే ముంబై పోర్టులో భద్రతా ఏజెన్సీలు అడ్డుకున్నాయి. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులు ఆ నౌకను మొత్తం తనిఖీ చేయగా.. ఇటలీలో తయారైన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్-సీఎన్‌సీ మెషిన్‌ను గుర్తించారు. ఈ తనిఖీలకు సంబంధించిన వార్తలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్‌డీఓ ధ్రువీకరించింది. ఈ సీఎన్‌సీ మెషిన్‌ను.. పాకిస్థాన్ తన అణు కార్యక్రమంలో ఉపయోగించే అవకాశం ఉందని డీఆర్‌డీఓ వెల్లడించడం పెను సంచలనంగా మారింది.
ఈ సీఎన్‌సీని కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని.. అది అత్యంత ఖచ్చితత్వంతో ఫలితాలను ఇస్తుందని డీఆర్‌డీఓ అధికారులు వెల్లడించారు. ఈ సీఎన్‌సీని రెండు రకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రక్షణ శాఖ అధికారులు ఆ పాక్ నౌకలోని సరకు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. చైనా నుంచి పాకిస్థాన్‌కు రవాణా అవుతున్న ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2022లో కూడా ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలు తరలిస్తుండగా.. భారత అధికారులు సీజ్ చేశారు.
ప్రాంతీయ, అంతర్జాతీయంగా భద్రత, స్థిరత్వానికి దోహదపడేందుకు 1996 లో వాస్సెనార్ అరేంజ్‌మెంట్ జరిగింది. ఒక దేశం నుంచి మరొక దేశానికి ఆయుధాలు, సాంకేతిక పరికరాల ఎగుమతుల్లో పారదర్శకత కోసం ఈ వాస్సెనార్ అరేంజ్‌మెంట్‌ను తీసుకువచ్చారు. ఈ అరేంజ్‌మెంట్ కింద భారత్ సహా 42 దేశాలకు భాగస్వామ్యం ఉంది. దీనిలో భాగంగా సీఎన్‌సీ మెషిన్ దుర్వినియోగాన్ని నివారించేందుకు 1996 నుంచి నియంత్రణ ఉంది. గతంలో ఉత్తరకొరియా కూడా తన అణు కార్యక్రమంలో ఈ సీఎన్‌సీ మెషిన్‌ను ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది.