జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. స్పెయిన్ దేశం నుంచి భారత పర్యటనకు వచ్చిన మహిళపై 10 మంది దుండగులు అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. మహిళ భర్త ఉండగానే.. అతని కళ్ల ముందే ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తర్వాత బాధిత మహిళ భర్తతో కలిసి పోలీస్ స్టే్షన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత జరిగిన ఘటనపై భార్యాభర్తలు ఇద్దరు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
స్పెయిన్‌కు చెందిన భార్యాభర్తలు.. విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగానే జార్ఖండ్‌లోని దుమ్కాకు శుక్రవారం చేరుకున్నారు. అక్కడ బైక్‌పై పర్యటిస్తున్న వారిద్దరు.. చీకటి కావడంతో కుంజి గ్రామం సమీపంలో ఎవరూ లేని ప్రాంతంలో టెంట్ వేసుకుని నిద్రించారు. అది గమనించిన కొందరు దుండగులు ఆ స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆ టెంట్‌లోకి దూరి ఆ విదేశీ మహిళపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆమె భర్త ఉండగానే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. చుట్టుపక్కల జనాలు లేకపోవడంతో సహాయం కోసం ఎంత అరిచినా ఉపయోగం లేకుండా పోయింది.
ఆ తర్వాత వారిద్దరూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటన గురించి వివరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న చంపై సోరెన్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు దుమ్కా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు సోషల్ మీడియా వేదిగా తన ఆవేదనను వెల్లబోసుకుంది.
విదేశీ పర్యటనలో భాగంగా టూరిస్ట్ వీసా మీద భారత్‌కు వచ్చిన స్పానిష్ జంట.. మోటార్ బైక్‌పై దుమ్కాలో పర్యటిస్తూ పలు ప్రదేశాలను సందర్శిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రేప్‌కు గురైన తర్వాత ఆ మహిళను పోలీసులు ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆసియా ఖండం మొత్తం పర్యటించాలని నిర్ణయించుకున్న ఆ జంట తొలుత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత జార్ఖండ్‌కు రాగా.. ఇక్కడ ఆ మహిళపై దారుణానికి ఒడిగట్టారు. భారత్ తర్వాత వారు నేపాల్ వెళ్లాలని నిర్ణయించుకోగా.. ఇంతలోనే ఈ దారుణం జరిగింది.