ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ బరి నుంచి తప్పుకున్న కమల్‌ హాసన్.. డీఎంకేకు మద్దతు.. రాజ్యసభ సీటు కేటాయింపు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2024, 11:59 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు జంప్ కావడం, మరోవైపు.. పార్టీల పొత్తులు.. ఇక కొన్ని పార్టీలకు మరికొన్ని పార్టీల మద్దతు.. ఇలా రకరకాల విన్యాసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో కొత్త పొత్తు పొడిచింది. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్.. తాజాగా తమిళనాడులో అధికార పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం-డీఎంకేకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం డీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ అయిన కమల్ హాసన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.


లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎంఎన్‌ఎంకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు డీఎంకే, కాంగ్రెస్ కూటమి అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టిన డీఎంకే.. మిగిలిన పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎండీఎంకే పార్టీతో పొత్తు కుదుర్చుకోగా.. ఆ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించింది. ఇక డీపీఐ పార్టీకి రెండు స్థానాలు ఇచ్చారు.


ఈ నేపథ్యంలో తమకు 10 సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, డీఎంకే పొత్తు ఆదివారం ఖరారు కానున్నట్లు వెల్లడించాయి. ఇక అధికారంలో ఉన్న డీఎంకే తమిళనాడులో ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉన్న చిన్న చిన్న పార్టీల మద్దతును కూడగడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com