గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్బేధ్యమైన 'మిషన్ దివ్యాస్త్ర' పరీక్షను భారత్ సోమవారం పరిశీలించిన విషయం తెలిసిందే. దీనిలో భారత్ ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే ఎంఐఆర్వో (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్) టెక్నాలజీని తొలిసారి పరీక్షించింది.
ఆయితే ఈ పరీక్షను చైనా జాగ్రత్తగా పరిశీలించింది. ఈ మేరకు బంగాళాఖాతం నుంచి చైనా పరిశోధక నౌక ద్వారా పరిశీలించినట్లు ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ తెలిపారు.