ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగే టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు వైసీపీకి వచ్చారు. ఆయన రాకతో రాజోలు నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు.. రాజోలు నియోజకవర్గం టికెట్‌పై ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో వైసీపీ వరుసగా రెండు సార్లు ఓడిపోయిందని.. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మూడోసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. రాజోలు సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలని సూచించారు. మళ్ళీ సర్వే నిర్వహించి గెలిచే వారికి టిక్కెట్ కేటాయించాలన్నారు. జగన్ ఆదేశిస్తే రాజోలు నుంచి గాని అమలాపురం లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. టికెట్ కోసం పోరాడే ఓపిక లేదని.. టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని రాపాక వరప్రసాదరావు స్పష్టం చేశారు.