వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మరో అవమానం జరిగింది. ఈనెల 14న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆరోజు 10 వేల కార్లు..జనాలు తనవెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మళ్ళీ ఇప్పుడు ముద్రగడ మాట మార్చి మరో లేఖ విడుదల చేసారు. భారీస్థాయిలో జనం వస్తే జగన్‌కు భద్రత సమస్య వస్తుందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఎక్కువమంది వస్తే కూర్చోడా నికి, నిలబడడానికి స్థలం సరిపోదని ఆ లేఖలో పేర్కొన్నారు. సీఎం వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందని ఆ లేఖలో వెల్లడించారు. అందువల్ల తాడేపల్లికి భారీ ర్యాలీ రద్దు చేసుకున్నట్లు లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.