ఏపీలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అనూహ్యంగా తెలుగు దేశం పార్టీలో చేరారు. ఇవాళ ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు.. వీరందరికి పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్ తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేష్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకీ సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర స్వామి, నరసింహులు, శాంతకుమారి, తదితరులు చేరారు.
తాను కర్నూలు లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నో హామీలు ఇచ్చి ఎంపీగా గెలిచానని.. వైఎస్సార్‌సీపీలో పదవులు మాత్రమే ఉంటాయి.. అధికారం ఉండదన్నారు సంజీవ్‌కుమార్. వైఎస్సార్‌సీపీలో ఉత్సవ విగ్రహంలా ఉండటం తనకు నచ్చలేదని.. అందుకే బయటకు వచ్చానన్నారు. ఏపీలో మూడు పార్టీల పొత్తు అభివృద్ధికి చిహ్నంగా వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి షరతులు లేకుండానే తెలుగు దేశం పార్టీలో చేరానన్నారు. కర్నూలులో వలసలు ఆగాలి, ఉపాధి కల్పించాలని.. రైతుల్ని ఆదుకోవడమే తన లక్ష్యమన్నారు.
సంజీవ్‌కుమార్ ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాని భావించారు.. కానీ అనూహ్యంగా చంద్రబాబును కలిసి టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధే లేదని.. అందుకే వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. బీసీలకు టికెట్లు ఇచ్చారు కానీ.. అధికారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిధిలో ఉన్నంత వరకు తాను పనులు చేశానని.. కర్నూలు జిల్లా నుంచి వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో కొన్ని నిర్ణయాలు జరగాలన్నారు. అపాయింట్‌మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ అనూహ్యంగా టీడీపీలో చేరారు.