మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పిల్లల సంరక్షణ సెలవులపై ప్రభుత్వం విధించిన నిబంధనలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో మహిళా ఉద్యోగులు తమ 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపింది.
కాగా, పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపు ఈ సెలవులు వినియోగించుకోవాలని గతంలో నిబంధన ఉండగా.. ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు.