బంగారం దిగుమతులకు సంబంధించి ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దిగుమతి సుంకం చెల్లించకుండా బంగారం దిగుమతికి అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో బంగారం దిగుమతిపై 15% సుంకం చెల్లించాలి. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ సుంకం భారం తగ్గనుంది.