దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరికలు జారీచేసింది. రైలు కదులుతున్న సమయంలో.. ప్రయాణికులు ఎక్కడం, దిగడం కాని చేస్తే చట్టరీత్యా నేరమని వెల్లడించారు. ఇంకా రైలు పట్టాలను ఫోటో తీసినా, సెల్ఫీ, ఫోటోలు దిగకూడదని హెచ్చరించారు.
ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘిస్తే 3నెలల జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా, లేదా రెండు శిక్షలను విధించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.