కళ్యాణదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు చేపట్టారు. విజిలెన్స్ ఎస్ఐ ఫణీంద్రనాథ్, ఏవో వాసుప్రకాశ్, సీఎస్ఓటీ సుబ్రహ్మణ్యం పట్టణంలో పలుచోట్ల గ్యాస్ సిలిండర్ల తనిఖీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న ఇళ్లలో వాడే 5 వంటగ్యాస్ సిలిండర్లను జప్తు చేసినట్లు తెలిపారు. సదరు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఫణీంద్రనాథ్ తెలిపారు.
![]() |
![]() |