ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న అధికారులపై, వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్డీయే కూటమి నేతలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సహకార సంఘాల (సొసైటీ)లో పర్సన్ ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్న అధికార పార్టీకి చెందిన వ్యక్తులను తక్షణమే తొలగించాలన్నారు. అలాగే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. దేవాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీలు వేయవద్దని సూచించారు. ఈ మేరకు గురువారం అమరావతి సచివాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు వర్ల రామయ్య, సయ్యద్ రఫీ, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, పార్ధసారధి జనసేన పార్టీ నేత చిల్లపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.