రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండల కేంద్రంలో బైక్, ఓమ్నీ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుమ్మగట్ట మండలం గోనబావికి చెందిన మారెన్న కొడుకు పెదబాబు, ఆంజనేయులు కొడుకు మణికంఠ బైక్పై మంగళవారం ఉదయం గుమ్మగట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. గాయపడిన ఇద్దరినీ రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.