కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు దర్శించుకున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఎంపీ మోపిదేవికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి మంగళవారం ఎంపీ మోపిదేవి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.