చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి పార్టీల అభ్యర్థి గురుజాల జగన్మోహన్ మంగళవారం చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి గుడిపాల మండల పరిధిలోని గ్రామాల ప్రజలు బ్రహ్మానందం పడుతూ అడుగడుగున నిరాజనాలను అర్పిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రరాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు పరచడం ఖాయమంటూ జగన్మోహన్ ప్రసంగానికి బ్రహ్మరథం పడుతున్నారు.