కనిగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ సోమవారం షిరిడిలోని సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శిరిడి సాయిబాబాని వేడుకున్నట్లు దద్దాల తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.