పింఛన్ల సొమ్మును సొంత కాంట్రాక్టర్లకు జగన్ దోచి పెట్టాలని జిల్లా టిడిపి అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆరోపించారు. ఒంగోలులోనే టీడీపీ కార్యాలయంలో సోమవారం నూకసాని మాట్లాడుతూ 1న రాష్ట్రవ్యాప్తంగా పింఛన్దారులకు ఇవ్వాల్సిన డబ్బులు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పథకాలకు బటన్ నొక్కి రూ. 13 వేల కోట్లు ఇచ్చారన్నారు. మార్చి 16 నుంచి 30లోపు జగన్ అనుకూల కాంట్రాక్టర్లకు ఎన్నికల కోడ్ అతిక్రమిస్తూ నిధులు దోచి పెట్టారన్నారు.