విశాఖపట్నంలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకుంటే.. ఐదు కిలో మీటర్ల దూరానికి ఏకంగా రూ.కోట్లలో ఛార్జ్ చేశారు. ఈ బిల్లు చూసి అవాక్కైన వ్యక్తి.. కస్టమర్ కేర్‌ను సంప్రదించిన తర్వాత సమస్య పరిష్కారం అయ్యింది. విశాఖపట్నం ఎంవీపీకాలనీకి చెందిన ఎ.వి.ఎస్.ప్రసాదరావు రెండు రోజుల క్రితం నగరంలోని హోటల్ మేఘాలయ నుంచి ఎంవీపీకాలనీ రావటానికి ఓ యాప్ ద్వారా ఆటోను బుక్ చేశారు.
ప్రసాదరావు వెళ్లాల్సిన ఐదు కిలో మీటర్ల దూరానికి ఆటో ఛార్జ్ రూ.3,59,45,507 చూపించింది. అంటే దాదాపుగా రూ.3.59 కోట్లు. దీంతో ప్రసాదరావు ఆటోడ్రైవర్‌తో గొడవ పడి టోల్‌ఫ్రీకి ఫోన్ చేసి మాట్లాడితే పొరపాటు జరిగిందన్నారు. ఆ ఐదు కిలో మీటర్ల దూరానిక రూ.200 కట్టాలని చెప్పారు. ఇలాంటి సాంకేతిక సమస్య వచ్చినప్పుడు ఆయా సంస్థల సిబ్బంది వెంటనే స్పందించాలని కోరారు. సాంకేతిక సమస్యతో ఇలా జరిగిందని చెబుతున్నారు.. గతంలో కూడా ఇలాంటి పొరపాట్లే కొన్ని జరిగాయి.