పచ్చబ్యాచ్ ఫిర్యాదుతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరం కావడంతో పింఛన్‌దారులు అగచాట్లుపడుతున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్‌లో గ్రామ సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయాల వద్దకు వచ్చే పింఛనుదారులు ఎండల కారణంగా ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు.