రేషన్ డీలర్, ఎండీయూ ఆపరేటర్ కుమ్మకై బ్లాక్ మార్కెట్‌కు పీడీఎస్ బియ్యం తరలి ంచేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. విజిలెన్స్ అధికారులు పక్కా సమా చారంతో తనిఖీలు చేపట్టగా ఒక ఆటోలో పీడీఎస్ బియ్యం లోడు చేసి తరలించేందుకు సిద్ధంగా ఉండటాన్ని గమనించారు. దీంతో ఆటో డ్రైవర్‌ను ఆరా తీసి తనిఖీలు చేపట్టగా తుని పరిధిలోని చేపూరు గ్రామానికి చెందిన రేషన్ షాపు నెంబరు 4కు హెల్పర్ అయిన కొత్తూరు నరసింహారావు సూచనల మేరకే బియ్యం లోడు చేసుకున్నట్లు డ్రైవర్ తెలిపారు. దీంతో సంబంధిత అధికారులు రేషన్‌షాపులో 4లో తనిఖీలు నిర్వహించగా అవకతవకలు బయటపడ్డాయి. విజిలెన్స్ అధికారుల విచారణలో రేషన్ డీలర్, ఎండీయూ ఆపరేటర్ పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తేల్చారు. 2650 కిలోల పీడీఎస్ బియ్యం, 87 కిలోల పంచదార, 6 కిలోల గోధుమలు సీజ్ చేసి రేషన్ డీలర్‌తో పాటు ఎండీయూ ఆపరేటర్, ఆటో డ్రైవర్‌లపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అధికారి జగన్నాథరెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో విజయ్‌కుమార్, సీఎస్‌డీటీ విజయ్‌కుమార్, జీవానంద శివ పాల్గొన్నారు.