టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర పూర్తి అయ్యింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ముగిసింది.