ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ ఆచరణలోకి తీసుకొచ్చేది నవర్నతాలు కాదని.. నవ అరాచకాలని బీజేపీ నేత నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదు ఫేక్ ప్రభుత్వమన్నారు. నియంత హిట్లర్‌ను మించి జగన్ గ్లోబుల్ ప్రచారం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన వచ్చిందన్నారు. ఇంటిలిజెన్స్ బ్యూరో (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ) లెటర్ హెడ్‌తో సర్వే అని ఫేక్ ఇచ్చారని.. ఎక్కడైనా ఇటువంటి ప్రకటనలు ఇంటిలిజెన్స్ బ్యూరో చేస్తుందా అని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్‌ను ప్రజలు తరిమే క్షణాలు దగ్గరలో ఉన్నాయన్నారు. నియంత జగన్ హిట్లర్‌ను ఫాలో అవుతున్నారని విమర్శించారు. పురందేశ్వరి పేరుతో ఒక లెటర్ హెడ్ సృష్టించి తప్పుడు సంతకాలు పెట్టి ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా అంతటా కూటమి కమ్మేస్తుందన్నారు.ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి కుటిల కుతంత్రాలు పన్నుతారని విరుచుకుపడ్డారు. సెంట్రల్ ఇంటిలిజెన్స్, పురందేశ్వరి పేర్లనే కాదు.. ఈటివి, ఈనాడు, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి లోగోలను కూడా అసత్య ప్రచారానికి ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారన్నారు. ఈ విషయంపై బీజేపీ, ఈటివి, ఈనాడు, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి... ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేశారన్నా తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉందని, మద్యానికి కొదవ లేదని వ్యాఖ్యలు చేశారు. గంజాయి, డ్రగ్స్ గుట్టు గుట్టలుగా మేటు వేసుకుని పోయాయన్నారు. తప్పు చేసిన అధికారులకు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. కాలవలు తవ్వి నీరు ఇవ్వలేని పరిస్ధితిని జగన్ కల్పించారన్నారు. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో ఫైబర్ నెట్ మూడు గంటల పాటు సర్వర్ పనిచేయకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. జగన్‌కు ఉన్న భయమే దీనికి కారణమని నాగభూషణం వ్యాఖ్యలు చేశారు.