ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్‌కు తెలుసు. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఏరోజు ఏరోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు. సంక్షేమ పథకాలే సీఎం వైయస్ జగన్‌ను గెలిపిస్తాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయి. మీరు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం వైయస్ జగన్‌ను ఓడించలేరు. సీఎం జగన్‌పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. కానీ, చంద్రబాబు, పవన్‌లకు మాత్రం వెటకారంగా ఉందన్నారు. నాదెండ్ల మనోహార్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గాయంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు. సీఎం వైయస్ జగన్ పేదల పక్షపాతి కనుక ఆయనను చూసేందుకు, కలిసేందుకు వస్తున్నారు. సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. పవన్ ఎన్నోసార్లు అనుచితంగా మాట్లాడారు. మళ్లీ వైయస్ఆర్‌సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారు. గతంలో పవన్ తాను మాట్లాడిన బూతులు మరచిపోయారా?. దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారు?. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడు. టీడీపీ వాళ్లు అశాంతిని సృష్టిస్తారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.
![]() |
![]() |