వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర పుట్టగుంట చేరుకుంది. జననేత రాకకోసం ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయకుండా వేచి చూస్తున్నారు. బస్సుయాత్రలో సీఎం తమ గ్రామాల వద్దకు రాగానే ఆయనను చూసేందుకు బస్సు వద్దకు వస్తూ... ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటన నేపధ్యంలో ఆయన యోగక్షేమాలు అడిగి కనుక్కుంటున్న ప్రజలు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న ప్రజలు. జరిగిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న అవ్వాతాతలు.దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూనే... బస్సుయాత్రలో ముఖ్యమంత్రికి సంఘీభావం ప్రకటిస్తున్న మహిళలు. తామంతా ముఖ్యమంత్రి వైయస్.జగన్ అండగా ఉండడంతో పాటు తిరిగి ఆయన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామంటున్న అక్కచెల్లెమ్మలు.